మా కుల పత్రికలు చాలా బాధలో ఉన్నాయి: వల్లభనేని వంశీ

  • చంద్రబాబుకు అధికారం దక్కలేదనే బాధలో ఉన్నాయన్న వంశీ
  • డబ్బు కోసం చంద్రబాబు పదవులు అమ్ముకున్నారని ఆరోపణ
  • మహిళా ఆఫీసర్ పై అచ్చెన్న అసభ్యంగా ప్రవర్తించారని విమర్శ
చంద్రబాబుకు అధికారం దక్కలేదని తమ కుల పత్రికలు బాధలో ఉన్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. అందుకే వైసీపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు డబ్బు కోసం పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ లేదు, బొక్కా లేదు, గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడని ఎద్దేవా చేశారు. తన గురించి అచ్చెన్నాయుడు మాట్లాడితే ఆయన గురించి చిట్టా విప్పుతానని అన్నారు. ఒక మహిళా ఆఫీసర్ పై అసభ్యంగా ప్రవర్తించి, ఆ తర్వాత చంద్రబాబు కాళ్లు పట్టుకున్న చరిత్ర అచ్చెన్నదని విమర్శించారు.

Vallabhaneni Vamsi
YSRCP
Chandrababu
Atchannaidu
Telugudesam

More Telugu News